Monday, December 23, 2024

నటి ఐశ్వర్యతో ఓ వ్యాపారవేత్త మార్ఫింగ్ ఫొటోలు… మాజీ భర్త బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీవి సీరియల్స్ నటి ఐశ్వర్య వీడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన మాజీ భర్తపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కమలాపురి కాలనీలో రమేశ్ బాబు అనే వ్యాపార వేత్త నివసిస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం నటి ఐశ్వర్యకు రమేశ్ పరిచయమ్యాడు. గత సంవత్సరం సెప్టెంబర్ 6న ఐశ్వర్య శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన కొన్ని రోజులు దంపతులు మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు జరిగాయి. భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నట్టు సమాచారం. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో రమేశ్‌కు శ్యామ్‌కుమార్ ఫోన్ చేసి పది లక్షల రూపాయలు ఇవ్వకుంటే ఐశ్వర్యతో దిగిన ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బెదిరించాడు. రమేశ్ అతడి బెదిరింపులను పట్టించుకోలేదు. మార్చి 12న తన భార్యతో రమేశ్ ఉండటం తాను చూశానని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అదే సమయంలో రమేష్ మార్చి 4 నుంచి మార్చి 14 వరకు ఆస్ట్రేలియాలో ఉన్నట్టు తెలిపాడు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి శ్యామ్ ప్రయత్నిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులకు రమేశ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News