- Advertisement -
మహట్టన్: అమెరికాలో ప్రముఖ వ్యాపార దిగ్గజం జేమ్స్ మైఖెల్ క్లైన్ ఆత్మహత్య చేసుకున్నారు. 64 సంవత్సరాల క్లైన్ అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తాను బసచేసిన కింబెర్లీ హోటల్ 20వ అంతస్తు నుంచి కిందికి దూకడంతో విషాదాంతం చెందారని వెరైటీ మేగజైన్‌లో వార్త వెలువడింది.
2000 సంవత్సరంలో ఆయన షాండాంగో మూవీ టికెటింగ్ వ్యాపారం ఆరంభించారు. కాగా న్యూయార్క్ పోలీసు విభాగం ప్రకటన మేరకు హోటల్ బయట ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్నట్లు, దర్యాప్తు సాగుతున్నట్లు వెల్లడైంది. ఇందులో ఈ వ్యాపారవేత్త గురించి తెలియచేయలేదు. కాగా ఈ బిజినెస్‌మెన్ హోటల్ గదిలో ఆత్మహత్య లేఖ పెట్టినట్లు వార్తా సంస్థలు ధృవీకరించాయి.
- Advertisement -