Sunday, January 12, 2025

బాలుడి కిడ్నాప్… రూ.50 లక్షల డిమాండ్… చంపేశారు

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వర్: ఓ బాలుడిని కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు ఇస్తేనే వదిలేస్తామని చెప్పి హత్య చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం ఝర్సాగూడ జిల్లా సర్బహాల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. వ్యాపార వేత్త కుమారుడిని కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 27న బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మార్చి 28 బాలుడి మృతదేహం బర్గఢ్ జిల్లాలో కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమిత్ శర్మ, దినేష్ అగర్వాల్ అనే వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని చంపేసి అనంతరం మృతదేహాన్ని తగలబెట్టామని ఒప్పుకునునారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News