Monday, December 23, 2024

బిజీ బిజీగా మృణాల్ ఠాకూర్

- Advertisement -
- Advertisement -

సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగునాట పా పులర్ అయింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆమె వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయింది. ప్రస్తు తం నాని, విజయ్ దేవరకొండలతో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్నా హిందీలో వెబ్ సిరీస్‌లు మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే ఈ భామ పలు వెబ్ డ్రామాస్ చేసింది. ఇటీవల తమన్నాతో కలిసి లస్ట్ స్టోరీ స్ 23లో నటించింది మృణాల్.

ఇప్పుడు మేడ్ ఇన్ హె వెన్ 2 అనే మరో వెబ్ సిరీస్‌తో మనలని పలకరించనుం ది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆడడం లేదు. హిందీలో వెబ్ సిరీస్, వెబ్ డ్రామాలకు క్రేజ్ పెరుగుతోం ది. అందుకే, పేరొందిన హీరోయిన్లూ వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఈ వెబ్ మార్కెట్‌లోనూ టాప్‌లో ఉండాలనే ఉద్దేశంతో మృణాల్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News