కల్లూరు : ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తుగానే అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఒకే విధమైన దుస్తులను అందించి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు అందించి మెరుగైన విద్యకు శ్రీకారం చుట్టారని కల్లూరు ఎంపీడీవో బి రవికుమార్ అన్నారు.
గురువారం కల్లూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో భారీ ర్యాలీ నిర్వహించి అనేకమంది విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు పాత్ర చాలా ఉందని దీనికి దీటుగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులకు వసతులకు న్యాయం గా మారాయని, అధిక సొమ్మును దుర్వినియోగం చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించి, ఉన్నత స్థాయికి ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండాలని,
ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగానే పాఠ్యపుస్తకాలు, నోట్స్ లు, పెన్నులు, పెన్సిళు,్ల పాఠశాల యూనిఫామ్ తో సహా ముందుగానే ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించిన ముఖ్యమంత్రి చొరవతో ముందస్తుగా విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తమ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారని దీనికి తోడుగా బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామాలలో విజయవంతం జరిగేలా ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని నిరూపించేందుకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యతో కూడుకున్న బోధనలను అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ దామోదర ప్రసాద్, జి మాధవరావు, సిఆర్పిలు వేలాద్రి, ఆరిఫ్, రవీంద్ర, రాము, శ్రీనివాస్, కృష్ణయ్య, లక్ష్మి, సిసిఓ, సాబి నారాయణపురం ప్రధానోపాధ్యాయులు వంగ రామారావు, గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.