Wednesday, January 22, 2025

ఎస్సారెస్పి జీరో పాయింట్ వద్ద పర్యాటకుల సందడి

- Advertisement -
- Advertisement -

ముప్కాల్: కాళేశ్వరం నుంచి నీరు విడుదల చేయడంతో ముప్కాల్ వరద కాలువ వద్ద ఉన్న జీరో పాయింట్ దగ్గరికి ప్రజల కుటుంబ సమేతంగా తండోపతండాలు వచ్చి నీటిని ఎత్తిపోస్తున్న తీరును తిలకించారు. ఆదివారం కావటంతో చుట్టూ పక్కల జిల్లాలు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల నుంచి జనాలు పెద్ద ఎత్తున వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదగా గడిపారు. అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రాజెక్టును సందర్శించి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముప్కాల్ మండల పరిసర ప్రాంతాల్లో ఊర పండుగలు సందర్భంగా గ్రామస్థులు వన భోజనాలను సైతం వరద కాలువ సమీపంలో జరగడంతో జనం తాకిడి ఎక్కువైంది. ఎస్సారెస్పీ జీరో పాయింట్ వద్ద కాలేశ్వరం నుంచి 2049 క్యూసెక్కుల నీటిని నాలుగు మోటర్ల ద్వారా విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట మట్టం 1091 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1065 అడుగులకు చేరి 21.233 టీంసిలుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 2049 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.
భద్రత మరిచిన అధికారులు
ముప్కాల్ కాలేశ్వరం పంపు హౌస్ వద్ద నిత్యం సందర్శకులు తాకిడి పెరగడంతో భద్రత ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. నీరు వెళ్తున్న కాల్వ పక్కన చిన్న కర్రలతో చిన్న కంచెను మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు చూడటానికి వచ్చిన వారు అదుపుతప్పే అవకాశం ఉందని భద్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

గోదావరి నీళ్లలో కాలేశ్వరం నీళ్లు కలిసే ప్రదేశంలో పర్యాటకులు సెల్ఫీలు తీయడం స్నానాలు చేయడం వంటివి ప్రమాదకరమని వచ్చిన పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టు అధికారులు, పోలీసు భద్రత సిబ్బంది శ్రద్ధ తీసుకొని పోలీసులను కాపలాగా ఉంచాలని పర్యాటకులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News