చాలామంది భారతీయులకు సొంత ఇల్లు ఓ కల. తమ జీవిత కాల పొదుపును ఇంటి కొనుగోలు కోసం వినియోగిస్తారు. అతిపెద్ద ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రాలలో హైదరాబాద్ ఒకటి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఉద్యోగం కోసం నగరానికి వస్తుంటారు. చాలామంది ఇంటి కొనుగోలు ఓ పెట్టుబడిగా భావించడంతో పాటుగా భవిష్యత్‌లో తమకు ప్రయోజనం కలుగుతుందని కూడా భావిస్తుంటారు. అయితే ఎలాంటి ఇల్లు కొనాలి మరీ ముఖ్యంగా ప్లాట్ కొనాలా లేదంటే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాలా అనేది ఎన్నటికీ అంతుచిక్కని ప్రశ్న. కాకపోతే ఈ ఐదు అంశాలను మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది….
1. విలాసవంతమైన మరియు స్వతంత్య్ర జీవనశైలి
ప్లాట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనాలున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్లాట్ కొనుగోలు చేయడం వల్ల ప్రీమియం, ఇండిపెండెంట్ జీవనశైలికి గ్యారెంటీ ఉంటుంది. మీ సొంత ప్లాట్ కొనుగోలు చేయడం వల్ల ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు ఉంటుంది. ఎలాగైనా దానిని వినియోగించుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవచ్చు. ప్లాట్ యజమానులు భూమిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉండదు. పైగా పూర్తి గోప్యత ఉంటుంది.
2. అనుకూలీకరణ మరియు సౌకర్యం
ఒకసారి మీరు ప్లాట్ సొంతం చేసుకుంటే, మీ కలల ఇంటిని సమగ్రమైన ల్యాండ్‌స్కేప్‌తో రూపొందించవచ్చు. దీనితో పాటుగా మీ వ్యక్తిత్వం ప్రతిబింబించేలా , మీ జీవనశైలికి తగినట్లుగా ఇల్లు నిర్మించుకోవచ్చు. అదే అపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చేసరికి మీరు వాడుకోని, అసలు నిర్మాణమే జరగని ప్రాంతంలో కూడా నిర్మాణం జరిగిన ప్రాంతపు రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం వల్ల చాలామంది తమ అభిరుచులను సైతం పక్కన పెట్టవలసి వస్తుంది.
3. పెట్టుబడులపై అధిక రాబడులు
ప్లాట్స్‌కు రీసేల్ విలువ ఎక్కువగా ఉంటుంది. ఓ మంచి ప్రాంతంలో ప్లాట్ ఉంటే, మీరు తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే లెక్క. తక్కువ పెట్టుబడులు, ఎక్కువ రాబడులు కారణంగా ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. మొట్టమొదటి సారిగా ఇల్లు కొనుగోలు చేస్తున్న వారికి అపార్ట్‌మెంట్ కొనుగోలుతో పోలిస్తే ప్లాట్ కొనుగోలు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఒకవేళ బడ్జెట్ పరిమితం అయితే నిర్మాణాలను ప్లాట్‌లో చేయనవసరం లేదు. భూమిపై మాత్రమే ధరలు పెరుగుతాయి. అపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చేసరికి యుడీఎస్(అన్‌డివైడెడ్ షేర్) కూడా కీలకపాత్ర పోషిస్తుంది.
4. ద్వంద్వ ఆస్తి
ప్లాట్ అనేది మీకు ద్వంద్వ ఆస్తిలా నిలుస్తుంది. అపార్ట్‌మెంట్‌ల్లో ఎక్కువ మంది ఇటీవలి కాలంలో ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, బిల్డర్ తాను చెప్పిన సమయానికి ప్లాట్‌ను అందించకపోవడం. తన ప్లాట్‌లో తాను చేరకపోతే ఫ్లాట్ కొనుగోలుదారుడు ఎన్నో విధాల నష్టపోతుంటాడు. ప్లాట్ యజమానులకు ఈ సమస్య లేదు.
5. పారదర్శక విధానంలో కొనుగోలు
చాలామంది ప్లాట్ కొనుగోలు అంటే భారీ మొత్తంలో నగదు పెట్టుబడి పెట్టాలని భయపడుతుంటారు. దానికి తోడు నమ్మకమైన వ్యక్తులు కాకపోతే అనే భయాలున్నాయి. కానీ ప్లాట్ రంగంలో కూడా కొన్ని కంపెనీలు నమోదు కావడంతో పాటుగా పారదర్శక విధానంలో ప్లాట్స్‌ను విక్రయిస్తున్నాయి. ప్లాట్ కొనుగోలుదారులకు ఎలాంటి కష్టమూ కలిగించకుండా తగిన చర్యలనూ తీసుకుంటున్నాయి. ప్లాట్ యజమానులు టైటిల్, లేఔట్ అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదా అని చూసుకుంటే చాలు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ సమీపంలో ప్లాట్స్ కొనుగోళ్లకు అనుకూలంగా ఉన్నాయి. మెరుగైన రాబడులనూ అందిస్తున్నాయి. ఎల్‌బీనగర్, బీఎన్ రెడ్డి నగర్, షాద్ నగర్, శంషాబాద్, వనస్థలిపురంలో ప్లాట్ కొనుగోలు చేస్తే రాబడులు కూడా బాగుంటాయి.
జీస్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ ‘‘ఇటీవలి కాలంలో చాలామంది తమ వ్యక్తిత్వంకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇండిపెండెంట్ హోమ్స్‌తో తమ అభిరుచులను సంతృప్తి పరుచుకోవచ్చనుకుంటున్నారు. భారీ ఓపెన్ ప్లాట్స్‌లో నచ్చిన విధంగా ఇల్లు కట్టుకుని ఉండాలనుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. భారీ మౌలిక సదుపాయాల కంపెనీలు కూడా ఈ విలువైన భూముల చుట్టూ అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి’’ అని అన్నారు.