Sunday, December 22, 2024

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ అయితే కనిష్ఠ స్థాయి నుంచి 1.5 శాతం రికవర్ అయింది.ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 694.39 పాయింట్లు లేక 0.88 శాతం లాభపడి 79476.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 217.96 పాయింట్లు లేక 0.91 శాతం పుంజుకుని 24213.30 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో మొత్తం 50 స్టాకుల్లో 39 లాభపడగా, 11 నష్టపోయాయి. జెఎస్ డబ్ల్యుస్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్ ప్రధానంగా లాభపడగా, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్, ఐటిసి, ఇన్ఫోసిస్ ప్రధానంగా నష్టపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News