Thursday, January 9, 2025

2025 నాటికి విద్యుత్ వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే నెం. 1

- Advertisement -
- Advertisement -

వెల్లడించిన సిఈఏ నేవేదిక

మనతెలంగాణ / హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ విద్యుత్ రంగంలో దూసుకు పోతోంది. ముఖ్యంగా విద్యుత్ వినియోగం గ్రేటర్ హైదరాబాద్‌లోనే అధికంగా జరుగుతోందని కేంద్ర విద్యుత్ అథార్టీ (సిఈఏ ) తన 19 ఎలక్ట్రిక్ పవర్ సర్వే (ఈపిఎస్‌లో) పేర్కోంది. ఈ సర్వే దేశంలోని 20 నగరాల్లో విద్యుత్ వినియోగం సర్వే చేసింది. పలు విభాగాల భవిష్యత్ అవసరాలను తీర్చిదిద్దేందుకు, మద్యస్థ, దీర్ఘకాలిక ప్రాతిపదికన విద్యుత్ డిమాండ్‌ను అంచనావేసేందుకు ఈ నివేదిక ఎంతో ముఖ్యమైంది. జూన్ 2015లో సిఈఏ ఏర్పాటు కాగా ఇప్పటి వరకు 18 సర్వేలు జరిగాయి.

విద్యుత్ వినియోగం విషయంలో ఇప్పటికీ బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలను హైదరాబాద్ అధిగమించింది. 2023-24 విద్యుత్ వినియోగంలో దేశ ఆర్దిక రాజధానిని ముంబాయిన సైతం దాటనుందని అంచనా వేసింది. 2024-25 ముంబైకన్నా 25 శాతం అధికంగా విద్యుత్ వినియోగం ఉండనుందని సీఈఏ తన నివేదికల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ మినహా 12 మెగా నగరాల్లో హైదరాబాద్ విద్యుత్ వినియోగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అగ్రస్థానంలో నిలువనున్నట్లు గణాంకాలు చెబుతు న్నాయి. దేశంలో విద్యుత్ రంగం పరోగతిపై 18వ విద్యుత్ సర్వేమ సిఈఏ వెల్లడించింది. దీని ప్రకారం. 2019-20లో బెంగళూరు విద్యుత్ వినియోగం 1883 మిలియన్ యూనిట్లు కాగా, చెన్నై 17.115 మిలియన్ యూనిట్లు, కోల్‌కతా 19,450 మిలియన్ యూనిట్లు, హైదరాబాద్ 21,700 మిలియన్ యూనిట్లు, ముంబై 21,977 మిలియన్ యూనిట్లుగా ఉంది. 202324 సంవత్సరంలో చెన్నైలో 20313 మిలియన్ యూనిట్లు, కోల్కతాలో 22,160 మిలియన్ యూనిట్లు, ముంబైలో 24137 మిలియన్ యూనిట్లు, హైదరాబాద్ 28,173 మిలియన్ యూనిట్లు ఉంటుందని తన నివేదికలో పేర్కొంది.

దీంతో ముంబైని హైదరాబాద్ దాటేయనుంది. ఇక 2024-25లో బెంగళూరులో 17,207 మిలియన్ యూనిట్లు, చెన్నైలో 21,168 మిలియన్ యూనిట్లు, కోలకతాలో 2281 మిలియన్ యూనిట్లు, ముంబై 24,700 మిలియన్ యూనిట్లు ఉండగా, హైదరాబాద్ ద్లో 30,051 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేసింది. 2019-30 లో హైదరాబాద్‌లో 3,330 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా. ముంబైలో 3,710 మెగావాట్లు ఉంది. 2023-24లో హైదరాబాద్‌లో డిమాండ్ ,4479 మెగావాట్లు, ముంబైలో 4123 మెగావాట్లు ఉండమందని.. అంచనా వేసింది. 2024-25 లో హైదరాబాద్ డిమాండ్ 4805 మెగావాట్లు, ముంబైలో 4234 మెగా వాట్లు ఉండనుందని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసిఆర్ విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యుత్ వ్యవస్థకు పటిష్టతకు కృషి చేయడమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News