- Advertisement -
ముంబయి: గ్రామీణ ప్రాంతాల్లో డెబిట్ కార్డులు లేనివారు, వాటిని వాడని వారు చాలా మందే ఉన్నారు. వారి కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్(ఎన్‌పిసిఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆధార్ నంబర్, ఓటిపి ద్వారా ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్’(యూపిఐ)సేవలను పొందడానికి వీలుగా మార్పులు చేయాలని బ్యాంకులకు సూచించింది. ఆధార్ నంబర్‌తో చెల్లింపుల కోసం గత ఏడాదే ఎన్‌పిసిఐ సర్కూలర్ జారీచేసింది. డిసెంబర్ 15లోగా నిబంధనలు అమలుచేయాలని సూచించింది. వివిధ కారణాల వల్ల బ్యాంకులకు వీలుకాకపోవడంతో తాజాగా ఆ గడువును ఎన్‌సిపిఐ మార్చి 15కి పొడిగించింది. ఇదిలావుంటే ఆధార్, ఓటిపితో యూపిఐ సేవలు పొందాలంటే వాడే మొబైల్ నంబర్ ఆధార్‌కు అనుసంధానం అయ్యుండాలి. అదే నంబర్ బ్యాంకు ఖాతాకు కూడా అనుసంధానం చేసి ఉంటేనే లావాదేవీలు సాధ్యపడతాయి.
- Advertisement -