Sunday, December 29, 2024

6 రాజ్యసభ ఖాళీలకు ఉప ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు రాజ్యసభ ఖాళీలకు డిసెంబర్ 20న ఉపఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. వైఎస్‌ఆర్‌సిపి సభ్యులైన మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్ రావు యాదవ్, ఆర్ కృష్ణయ్య ఈ ఏడాది ఆగస్టులో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్యల పదవీకాలం 2028 జూన్ 21న ముగియనుండగా మోపిదేవి వెంకటరమణ 2026 జూన్ 21న పదవీ విరమణ చేయాల్సి ఉంది. బిజూ జనతా దళ్ నుంచి బహిష్కరణకు గురైన సుజీత్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన దరిమిలా ఒడిశాలో ఒక రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆయన పదవీకాలం 2026 ఆప్రిల్ 2న ముగియవలసి ఉంది.

కోల్‌కతాలో మహిళా డాక్టర్ హత్యాచార ఘటనపై టిఎంసికి చెందిన జవహర్ సర్కార్ రాజీనామా చేయడంతో పశ్చిమ బెంగాల్‌లో ఒక రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆయన కూడా 2026 ఏప్రిల్‌లో రాజీనమా చేయాల్సి ఉంది. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు క్రిషన్ లాల్ పన్వర్ తన పదవికి రాజీనామా చేయగా ఆ రాష్ట్రంలో ఒక స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వం, ఒడిశాలో బిజెపి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో రాజ్యసభ ఉప ఎన్నికలపై ఆయా రాష్ట్రాలలో ఆ రెండు పార్టీలదే పైచేయి కానున్నది. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి, హర్యానాలో బిజెపి అధికారంలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News