న్యూఢిల్లీ: 11రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ స్థానాలు, రెండు రాష్ట్రాల్లోని రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కొవిడ్19 బారినపడి గతేడాది సెప్టెంబర్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు మరణించినందున ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది. కర్నాటక బెల్గాం లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన కేంద్రమంత్రి సురేశ్‌అంగాడీ గతేడాది సెప్టెంబర్‌లో మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల్లో రాజస్థాన్ నుంచి మూడు, కర్నాటక నుంచి రెండు, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కో స్థానం ఉన్నాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న జరపనున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున జరగనున్నది.