Saturday, November 16, 2024

పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

- Advertisement -
- Advertisement -

byelections
ప్రకటించిన  ఎన్నికల  సంఘం
తెలంగాణలోని  హుజురాబాద్‌కు…

న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు పార్లమెంటు స్థానాలకు, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంగళవారం ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించింది.
దాద్రా,నాగర్‌హవేలి,డామన్ కేంద్రపాలిత ప్రాంతం, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్(ఎస్సీ); అస్సాంలోని గోస్సాయ్‌గావ్, భవానీపూర్, తముల్‌పూర్, మరియాని, థోవ్రా; బీహార్‌లోని కుశేశ్వర్ ఆస్థాన్(ఎస్సీ), తారాపూర్; హర్యానాలోని ఎల్లెనబాద్; హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్‌కొత్‌ఖాయ్; కర్నాటకలోని సింద్గీ, హంగల్ ; మధ్యప్రదేశ్‌లోని పృథ్వీపూర్,రాయ్‌గావ్(ఎస్సీ), జోబత్(ఎస్టీ); మహారాష్ట్రలోని దేగ్లుర్(ఎస్సీ); మేఘాలయలోని మావ్రీంగ్‌క్నెంగ్(ఎస్టీ), రాజబలా; మిజోరంలోని త్యురియల్(ఎస్టీ); నాగాలాండ్‌లోని షమ్తోర్‌చెస్సోరే(ఎస్టీ); రాజస్థాన్‌లోఇని వల్లభ్‌నగర్, ధరియావాడ్(ఎస్టీ); తెలంగాణలోని హుజురాబాద్; పశ్చిమబెంగాల్‌లోని దిన్హాత, శాంతిపూర్, ఖర్దాహ, గోసబ(ఎస్సీ) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయని ఇసి ప్రకటించింది.
ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటన ప్రకారం అక్టోబర్ 1న ఉపఎన్నికల ప్రకటన జారీ కానుంది. నామినేషన్ల దాఖలు చివరి తేదీ అక్టోబర్ 8. ఎన్నికల సంఘం నామినేషన్లను అక్టోబర్ 11న పరీక్షించనుంది. నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 13 గా ఖరారు చేసింది. అక్టోబర్ 30న ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 2న ప్రకటిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News