హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఇచ్చిన అవకాశం తినే కంచంలో మన్ను పోసుకున్నట్లయిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత వనం శ్రీరామ్ రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీరామ్ రెడ్డికి.. కెటిఆర్ కండువా కప్పి బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. రేవంత్ మాటలన్నీ బోగస్.. 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని అన్నారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకొనే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించిందని తెలిపారు. ఎఫ్‌టిఎల్‌లో ఉన్న కాంగ్రెస్ నేతలను హైడ్రా ముట్టుకోదని అన్నారు. గత ఎన్నికల్లో ఓటమితో బిఆర్‌ఎస్ కంటే ప్రజలకే ఎక్కువ నష్టం జరిగిందని.. కెసిఆర్ మరోసారి సిఎం కావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు శత్రువులే అని.. ఈ ఏడాదిలో ఉప ఎన్నికలు వస్తాయని.. అందుకు అందరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.