Thursday, January 23, 2025

సోమవారం నాటికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి

- Advertisement -
- Advertisement -
  • అదనపు కలెక్టర్ రమేష్

మెదక్: సోమవారం నాటికి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుందని అదనపు కలెక్టర్ రమేష్ శనివారం తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 407 కొనుగోలు కేంద్రాల ద్వారా 62,985 మంది రైతుల నుంచి 593 కోట్ల 25 లక్షల విలువగల 2,87,987 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 2,76,520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు. ఇందుకు సంబంధించి 28,434 మంది రైతులకు సుమారు 226 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో వేశామని, మి గతా డబ్బులను త్వరలో జమ చేస్తామన్నారు. టాబ్ ఎంట్రీ కూడా వేగవంతంగా జరుగుతుందని, 85 శా తం టాబ్ ఎంట్రీ పూర్తయ్యిందని, మిల్లర్లు కూడా 91 శాతం అకనాలెడ్జ్మెంట్ ఇచ్చారని ఆయన తెలిపారు.

జిల్లాలో 3,51,990 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా శుక్రవారం వరకు 2,87,987 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, ఈ మూడు రోజులలో రైతుల నుండి ధాన్యం పూ ర్తిగా కొనుగోలు చేసి సోమవారం సాయంత్రం నుంచి కొనుగోలు కేంద్రాలు మూసివేస్తామని రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News