Saturday, December 21, 2024

జూలో లేని జంతువుల కోసం రూ.20 కోట్లతో బోన్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : ముంబై లోని బైకుల్లా జూలో జంతువులు లేకపోయినా రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి బోన్లు కొనుగోలు చేసిన వ్యవహారం బయటపడింది. సమాచార హక్కు చట్టం ద్వారా విజిల్ బ్లోయర్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని వెలుగు లోకి తీసుకువచ్చింది. బైకుల్లా జూలో సింహాల కోసం రూ.8.25 కోట్లు, తోడేళ్ల కోసం రూ.7.15 కోట్లు, నీటికుక్కల కోసం రూ.3.82 కోట్లు, ఖర్చు పెట్టారు. ఈ మొత్తంతో వాటికి ప్రత్యేకంగా బోన్లు కొన్నట్లు లెక్కలు చూపారు. దీనిపై విమర్శలు రావడంతో బీఎంసీ అధికారులు స్పందించి ధరలు పెరిగే అవకాశం ఉన్నందునే ముందస్తుగా ఎన్‌క్లోజర్లను కొనుగోలు చేశామని ఓ అధికారి పేర్కొన్నారు. కేంద్ర పశు సంవర్ధక శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టామని ఆ అధికారి వివరించారు. కొత్త జంతువులు జూకి రావడానికి సమయం పడుతుందని మరో అధికారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News