Thursday, January 9, 2025

బైబై గణేశా…

- Advertisement -
- Advertisement -

ట్యాంక్ బండ్… భక్తజన బంధు

ప్రశాంతంగా నిమజ్జనం

అశేషభక్తజనం కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి గణనాథులు

మధ్యాహ్నం ఒంటి గంటకు సాగర్ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి

పకడ్బందీ ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం

ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా సాఫీగా యాత్ర కొనసాగేలా పోలీసుల చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా వర్షంలోనూ ఉత్సాహంగా సాగిన శోభాయాత్ర

మతసామరస్యాన్ని చాటిన హైదరాబాద్ జంట నగరాల ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు, శోభాయాత్రలు గురువారం కన్నుల పండువగా సాగాయి. భక్తులు ఉత్సాహంగా కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు,డిజె పాటలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. నవరాత్రులు పూజలందుకున్న పార్వతి తనయుడు అశేష భక్త జనం మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. రాష్ట్రవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వైభవంగా రంగుల రంగుల వీధి దీపాలతో మండపాలు ఏర్పాటు చేసి విఘ్నాలు తొలగించమని వినాయకుడిని వేడుకున్నారు.తొమ్మిది రో జులు చిన్నాపెద్దా కలిసి చేసిన ఉత్సవాల స్మృతులను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు, శోభాయాత్రలు కన్నుల పం డుగా సాగాయి. భక్తులు ఉత్సాహంగా కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు, డిజె పాటలతో గణనాథుడిని వీడ్కోలు పలికారు. నవరాత్రులు పూజలందుకున్న పార్వతి తనయుడు అశేష భక్త జనం మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. రాష్ట్రవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వైభవంగా రంగుల రంగుల దీపాలతో మండపాలు ఏర్పాటు చేసి విఘ్నాలు తొలగించమని వినాయకుడిని భక్తులు వేడుకున్నారు. తొమ్మిది రోజులు చిన్నాపెద్దా కలిసి చేసిన ఉత్సవాల స్మృతులను నె మరువేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. శోభయాత్రలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు, వైద్య శిభిరాలు, ప్రత్యేక బ స్సులు, మెట్రోరైళ్లను ఏర్పాటు చేసి నిమజ్జనం ప్రదేశాలకు చేరుకునేలా చేశారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులు మహమూద్‌అలీ, తలసాని, డిజిపి, నగర పోలీసు కమిషనర్ గ్రేటర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రంలో పేరుగాంచిన ఖైరతాబాద్ గణపతిని అధికారులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. బడా గణపతి ముందు పోలీసు లు ఉత్సహంగా తీన్మార్ దరువుకు భక్తులతో నృ త్యాలు చేసి చూపరులచే శబాష్ అనిపించుకున్నా రు. అదే విధంగా లడ్డు వేలం పాటలకు ఎంతో ప్రా ధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూకు ఈ సారి భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడటంతో రూ. 27 లక్షలకు దాసరి దయానంద్‌ రెడ్డి సొంతం చేసుకున్నారు. మంత్రులు సబితా ఇం ద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ హుస్సేన్‌సాగర్ తీర ప్రాంతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా గోదావరి, కృష్ణనది తీర ప్రాంతాల్లో కూడా గణేష్ నిమజ్జనం పెద్ద సంఖ్యలో సాగింది. సమీప జిల్లాలకు చెందిన ప్రజలు అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించి చివరి రోజు అమ్మ ఒడికి గణపతి చేర్చారు.

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణపతి
నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకు న్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరా డు. 63 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువున్న ఈవిగ్రహ నిమజ్జనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్ గణనాథుడిని సందర్శించేందుకు ఇసుకెస్తే రాలనంత జనం వచ్చి బైబై వినాయక అంటూ వీడ్కోలు పలికారు. మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా సచివాలయం ముందు నుంచి హు స్సేన్‌సాగర్ వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు మహాగణపతికి పూజలు నిర్వహించారు. అనంతరం నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశా రు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సం ఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం ఖైరతాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభం కాగా మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఖైరతాబాద్ గణపతి అమ్మ చెంతకు చేరాడు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్ మళ్లించారు. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అర్థరాత్రి వరకు నిమజ్జనం కొనసాగింది.

సాగర తీరానికి బాలాపూర్ గణపతి
బాలాపూర్ గణేశుడు చేరుకోగా నిమజ్జనం సా యంత్రం 5 గంటలకు క్రేన్ నెంబర్ 13 దగ్గర పూర్తి చేశారు. భారీ ఊరేగింపులో సాగిన శోభయాత్ర పాతబస్తీ మీదుగా నాంపల్లి, సచివాలయం వరకు వేలాది మంది భక్తుల మధ్య తరలించారు. అంతకు ముందు బాలాపూర్ లడ్డూ వేలంపాటలో అత్యధిక ధర పలికింది. ఈ సారి లడ్డూను దాసరి దయానందరెడ్డి రూ.27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కొలాహలం నెలకొంది. డ్యాన్సులు, డీజేలతో భక్తులు సందడి చేస్తున్నారు.

ఏరియల్ సర్వే నిర్వహించిన మంత్రులు
నగరంలో గణనాథులు భారీగా నిమజ్జనానికి తరలిస్తుండటంతో గణపతులన్ని ట్యాంక్ బండ్ వైపునకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిమజ్జనం జరుగుతున్న తీరును మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, డిజిపి అంజనీకుమా ర్, నగర పోలీసు కమిషనర్ సివి. ఆనంద్‌లు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రు లు ఏరియల్ సర్వే చేశారు. గణేష్ నిమజ్జనాన్ని మంత్రులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా మం త్రి తలసాని మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సాఫీ గా సాగేలా ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందన్నారు. ఎప్పటికప్పుడు నిమజ్జనం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నామన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 25 చెరువులు, కుంటల వద్ద నగరపాలక సంస్థ అధికారులు 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. గణేశ్ మహరాజ్ కీ జై అనే నినాదాలతో ఓరుగల్లు మారుమోగిపోయింది. ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుం డా 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏ ర్పాటు చేశారు.

తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టిన మంత్రి
నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్రలో వైభవంగా సాగింది. పట్టణంలో బుధవార్ పేట నంబర్ 1 వినాయకుని వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. కార్యకర్తల కోరిక మేరకు కొద్ది సేపు మంత్రి తీన్మార్ డ్యాన్స్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News