Monday, January 20, 2025

వ్యక్తులు వాళ్లే..రంగులే మారాయ్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబిఐలతో బిజెపి చేస్తున్న బెదిరింపు రాజకీయాల పై హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వె లిశాయి. బిజెపిలో చేరకముందు చేరిన తర్వాత అంటూ వెలసిన ఈపోస్టర్లు, ఫ్లె క్సీలను ప్రజలు ఆసక్తిగా చదుతున్నా రు. బిజెపిలో చేరకముందు, చేరిన త ర్వాత అంటూ ఆ పార్టీలో చేరిన కొం దరు నాయకుల పేర్లతో కూడిన పోస్టర్‌లను నగర వ్యాప్తంగా అంటించారు. ఈ పోస్టర్‌లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ,

పశ్చిమబెంగాల్ బిజెపి నాయకుడు సువేందు అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త, ఎంపి సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఐటీ, సిబిఐ రైడ్స్‌కు ముందు, తర్వాత రంగు మారినట్లు చూపించారు. తెలంగాణలో కవిత మాత్రం రైడ్స్‌కు ముందు, తర్వాత ఒకేలా ఉన్నారని అసలైన రంగులు వెలవవంటూ ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. చివరలో బైబై మోడీ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ఈ పోస్టర్లను అంటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు చూపురులను చదివేలా చేస్తున్నాయి. బిజెపి చేపట్టిన అవినీతి విధానాలు, భయబ్రాంతులను ఎలా చేస్తుందో ఈ పోస్టర్‌లో కళ్లకు కట్టినట్టు చూపించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News