Saturday, December 28, 2024

ములాయం స్థానానికి ఉప ఎన్నిక డిసెంబర్ 5న

- Advertisement -
- Advertisement -
ఐదు రాష్ట్రాలలో ఐదు స్థానాల ఓటూ ఇదేరోజు

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటివరకూ ఈస్థానం ఎంపిగా ఉన్న సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అవసరం ఏర్పడింది. ఎన్నిక ప్రక్రియ గురించి ఎన్నికల సంఘం శనివారం ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 10వ తేదీన ములాయం సింగ్ మృతి నాటి నుంచి ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికతో పాటు ఐదు రాష్ట్రాలలోని ఐదు ఖాళీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను కూడా ఈ లోక్‌సభ స్థానం ఎన్నిక ప్రక్రియతో పాటు ఇసి వెలువరించింది. ఇవి కూడా డిసెంబర్ 5వ తేదీనే జరుగుతాయి. ఒడిషా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఛత్తీస్‌గఢ్, బీహార్‌లలో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News