- Advertisement -
న్యూఢిల్లీ : ఎడ్‌టెక్ దిగ్గజం బైజుస్ సుమారు 2,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆప్టిమైజేషన్ ప్లాన్‌లో భాగంగా సంస్థలో దాదాపు 5 శాతం మంది సిబ్బందిపై వేటు వేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇటీవల నష్టాలను చవిచూస్తున్న ఈ స్టార్టప్ నిధులను సమీకరిస్తోంది. ఆరు నెలల్లో లాభాలే లక్షంగా కంపెనీ అడుగులు వేస్తోంది. కంపెనీలో మొత్తం 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
- Advertisement -