న్యూఢిల్లీ: డెహ్రా స్థానానికి మొత్తం పది రౌండ్ల కౌంటింగ్ ముగియగా, కాంగ్రెస్ అభ్యర్థి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేశ్ ఠాకూర్ 9,000 ఓట్లకు పైగా విజయం సాధించారు. మరోవైపు హమీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పుష్పిందర్ వర్మపై బిజెపి అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో టిఎంసి అభ్యర్థి కృష్ణ కళ్యాణి 50,000 ఓట్లకు పైగా గెలుపొందారు.
జలంధర్ పశ్చిమ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మొహిందర్ భగత్ 37 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళూర్ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. మొత్తం నాలుగు పశ్చిమ బెంగాల్ స్థానాల్లో TMC ముందంజలో ఉంది, రాయ్‌గంజ్ అభ్యర్థి కృష్ణ కళ్యాణి ఏడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత 50000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు జూలై 10న పోలింగ్ ముగిశాయి. ఓ మోస్తరు నుంచి అధిక పోలింగ్ నమోదైంది. వివిధ పార్టీలకు చెందిన ప్రస్తుత ఎంఎల్ఏల మరణాలు లేదా రాజీనామాల కారణంగా ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఖాళీ సీట్లు బీహార్‌లోని రూపాలి; పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బగ్దా ,మానిక్తలా; తమిళనాడులోని విక్రవాండి; మధ్యప్రదేశ్‌లోని అమరవారా; ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ మరియు మంగళూర్; పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్; మరియు హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, హమీర్‌పూర్, నలాగర్.
VIDEO | Assembly bypolls: Congress workers celebrate after party candidate Kamlesh Thakur, wife of Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu, takes lead in Dehra assembly seat after sixth rounds of counting.
(Full video available at PTI Videos – https://t.co/dv5TRARJn4) pic.twitter.com/INXgzn8NpI
— Press Trust of India (@PTI_News) July 13, 2024