Sunday, December 22, 2024

ఏడు రాష్ట్రలలో జులై 10న ఉపఎన్నికలు: ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

ఉపఎన్నికలు జులై 15 లోగా పూర్తికావాలన్న ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ:  భారత ఎన్నిక సంఘం(ఈసిఐ) ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది.  ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లు ఇలా ఉన్నాయి:

బీహార్ (1), పశ్చిమబెంగాల్ (4), తమిళనాడు(1), మధ్యప్రదేశ్(1), ఉత్తరాఖండ్(2), పంజాబ్(1), హిమాచల్ ప్రదేశ్(3). జులై 10న వీటికి ఉపఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు జులై 13న జరుగనున్నది.

ఉపఎన్నికల షెడ్యూల్:

నామినేషన్ ల దాఖలు చివరి తేదీ: జూన్ 21

నామినేషన్ల పరిశీలన: జూన్ 24

అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ: జూన్ 26

పోలింగ్ తేదీ: జులై 10

ఫలితాలు: జులై 13

ఉపఎన్నికలు అనేవి అధికారంలో ఉన్న అభ్యర్థి రాజీనామా చేసినా లేక చనిపోయినా ఏర్పడిన ఖాళీ స్థానానికి జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News