Tuesday, September 17, 2024

జులై 10న 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

దేశం లోని ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జులై 10 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. రుపౌలీ (బీహార్), రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్‌తలా (పశ్చిమబెంగాల్) విక్రవాండీ (తమిళనాడు),అమర్‌వాడా (మధ్యప్రదేశ్), బద్రీనాథ్ ,మంగ్లౌర్ (ఉత్తరాఖండ్), జలంధర్ వెస్ట్ (పంజాబ్), డెహ్రా, హమీర్‌పుర్ , నాలాగఢ్(హిమాచల్ ప్రదేశ్), అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మానిక్‌తాలా, విక్రవాండీ, మంగ్లౌర్ స్థానాల్లో ఎమ్‌ఎల్‌ఎలు మృతి చెందగా, మిగతా చోట్ల రాజీనామా చేశారు. జూన్ 14 వ తేదీన ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలియజేసింది. జూన్ 21 లోగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోవాలని, జూన్ 24న నామినేషన్ పత్రాల పరిశీలనకు చివరితేదీగా పేర్కొంది. జులై 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News