Sunday, December 22, 2024

తిరుమల వెళ్లేందుకు జగన్‌కు ఏ అర్హత ఉంది: బైరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల వెళ్లేందుకు జగన్‌కు ఏ అర్హత ఉందని మాజీ ఎంఎల్ఎ, రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.. జగన్ ఏకంగా తిరుమలేశుడ్నే నిలువు దోపిడీ చేశారని ఆరోపణలు చేశారు. వైఎస్‌ఆర్ జిల్లాను దేవుని కడపగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతి లడ్డూను కల్తీ చేశారని వీరశైవ లింగాయత్ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరభద్ర స్వామికి పూజలు చేసి శూలాలు గుచ్చుకొని పాపపరిహారం చేశారు. ఎపి వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమల లడ్డూ కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూను కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News