Friday, January 24, 2025

పవన్ కళ్యాణ్‌పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎపిలో రాజకీయాలు ఎన్నడూ లేనంత రంజుగా మారాయి. అధికార పార్టీ నేతలు ఇతర పార్టీల నాయకులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ సిపి నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఎవరు పట్టించుకునేవారు లేకే పవన్ కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందనటం సరికాదని ఆయన పేర్కొన్నారు. పవన్‌కి ఓటు వేయాలని ఏపీలో ఎవరూ అనుకోవట్లేదు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పష్టం చేశారు.

టిడిపి హయాంలో జమ్మభూమి కమిటీలు చేసిన పనులను ఎవరు ప్రశ్నించలేదన్నారు. పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసమే ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ముందు మంగళగిరి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బైరెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనలో ఎలాంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయో తెలుసుకుని మాట్లాడలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News