- Advertisement -
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుబడిన వారిని భారత్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ ఆరంభించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు విమానాలు న్యూఢిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్, రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు.
- Advertisement -