సి.పి.ఆర్. పర్యావరణ విద్య కేంద్రం , చెన్నై
జూలై 22, 23 తేదీలలో వేగన్ ఫెస్టివల్ – ఆకుపచ్చ బాటన నడుద్దాం!!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ, సి. పి రామస్వామి అయ్యర్ ఫౌండేషన్ , చెన్నైల సంయుక్త ఆధ్వర్యంలో 1989 సంవత్సరంలో సి.పి.ఆర్.పర్యావరణ విద్యా కేంద్రం (సి.పి.ఆర్.ఇ.ఇ.సి) పర్యావరణ విద్యలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ ఏర్పాటు చేశారు. ” ఆహారం-పర్యావరణం- ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిద్దాం- ఆకుపచ్చ బాట నడుద్దాం” అనే ప్రధాన ఉద్దేశ్యంతో ఆంద్ర ప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణా , తమిళనాడులలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
పశుసంపద పెంపకం పర్యావరణంపై అతిపెద్ద పాదముద్రను వేస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌హౌస్ వాయువుల ఉత్పత్తిలో 18 శాతాన్నిఆక్రమించిందని డాక్టర్ పి సుధాకర్ తెలిపారు. వాతావరణ మార్పులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం మనం సేవిస్తోన్న పాలు 59 రకాల వివిధ శక్తివంతమైన హార్మోన్లు కలిగి మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయి. వాతావరణ మార్పులను నివారించడానికి పాలకు ప్రత్యామ్నాయంగా మంచి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆకుకూరలు, కాయధాన్యాలు, చిక్కుళ్ళు, ఆకుపచ్చ సహజ ఉత్పత్తులైన సోయా, సోయా బీన్స్, పుట్టగొడుగులు , ప్రత్యామ్నాయ వృక్ష సంబంధిత కొబ్బరి పాలు, బాదాం పాలు, వేరుసెనగ పలు తదితరాలను వినియోగించాలని సూచిస్తున్నామని డాక్టర్ పి సుధాకర్ తెలియజేశారు.
పై విషయాలను వాటి ఆవశ్యకతను ప్రజలకు వివరించడానికి సి.పి.ఆర్.ఇ.ఇ.సి చెన్నై, హైదరాబాద్ కు చెందిన ‘ వైబ్రాంట్ లివింగ్’ సహకారం తో ఈ నెల 22, 23 తేదీలలో హైదరాబాద్, మాదాపూర్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, తెలంగాణ ఎం.పి.సి.సి. మొదటి అంతస్తు, కావూరి హిల్స్ లో వేగ నిజం పూర్తి శాకాహారంపై ఉత్సవం – “ఆకుపచ్చ ( పూర్తి శాకాహారం) బాట నడుద్దాం” అనే నినాదంతో రెండు రోజుల కార్యశాల, ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం మరియు సమాచార సాంకేతిక శాఖ (IT) ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఐఎఎస్ ఈ ఉత్సవాన్ని జూలై 22 శనివారం ఉదయం 10.00 గంటలకు ప్రారంభించడానికి అంగీకరించారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో వేగన్ వంట శాల, యోగా, కుమ్మరి , ఫ్యాబ్రిక్ పెయింటింగ్, వేగన్ ఫ్యాషన్, తోట పని, రీసైక్లింగ్ పై వివిధ వినూత్న ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయి. పర్యావరణ పాల ఉత్పత్తి , మంచి చెడులపై వివరణాత్మక వీడియో చిత్ర ప్రదర్శన కూడా ఉంటుంది.
ప్రదర్శన వివరాలు:
• వైబ్రాంట్ లివింగ్ – వేగన్ ఆహారం
• నెట్ జీరో లివింగ్ – వెల్ నెస్ ఉత్పత్తులు
• విజయ్ స్వీట్స్ – వేగన్ స్వీట్లు
• జననోమ్ సహజ న్యూట్రిషన్ – వృక్ష సంబంధ ఆరోగ్య మిశ్రమాలు
• సోయా వీటా – సోయా బేవరేజస్ పౌడర్
• అప్ సైక్లింగ్ రీసైకిల్డ్ క్లాత్ బ్యాగులు
• జెస్ట్ న్యూట్రిషన్ – న్యూట్రిషన్ ఉత్పత్తులు
• అరుణ్య
• అరుణ్య చేనేత – చీరలు
• సిమీస్ వరల్డ్ వేగన్ కేఫ్ – ఆహారం దాని ఉత్పత్తులు
• ఉజ్వల – కుమ్మరి ఉత్పత్తులు
• మన్‌ప్రీత్ – కుమ్మరి ఉత్పత్తులు
• ఫ్రాస్టీ ఐస్ క్రీమ్స్
• ఎవిటెర్రా – సేంద్రీయ వ్యవసాయం , తోటపని
• గ్రామ బజార్, ప్రకృతి ఆధారిత మందులు
• యతిరాజ్- ప్రకృతి సహజ ఉత్పత్తులు – వ్యక్తిగత , గృహ సంబంధ ఉత్పత్తులు
• కూపర్ ఉత్పత్తులు – బెల్ట్‌లు, పర్సులు, ఇతర ఉపకరణాలు
మరి కొన్ని ఉత్పత్తుల ప్రదర్శన ప్రజాప్రయోజనార్ధం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి.