నేడు బాధ్యతల స్వీకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి ఎల్‌జి(లెఫ్టినెంట్ గవర్నర్) గానూ ఆయనకు అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో రాష్ట్రానికి వరుసగా మూడో తమిళ వ్యక్తి గవర్నర్‌గా నియమితు లైనట్లయ్యింది. రాష్ట్ర గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమా ణ స్వీకారం చేయించనున్నారు.
ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రికి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్‌గా నియమించే వరకు తెలంగాణ గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్ కొనసాగ నున్నారు. మరో వైపు తెలంగాణ గవర్నర్‌తో పాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించటం పట్ల ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Jharkhand Governor C. P. Radhakrishnan has been given additional charge as Telangana Governor and Lieutenant Governor of Puducherry.
The appointment comes after President #DroupadiMurmu accepted the resignation of Dr. Tamilisai Soundararajan. pic.twitter.com/tghMyh6TTd
— All India Radio News (@airnewsalerts) March 19, 2024