Sunday, December 22, 2024

కోడ్ ముందు కాక

- Advertisement -
- Advertisement -

అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని అ మలులోకి తీసుకువచ్చింది. సోమవారం సా యం త్రం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది.పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ), 2019ను అమలులోకి తీసుకువస్తున్నామ ని హోం మంత్రిత్వశాఖ ఓ అధికారిక ప్రకటన వె లువరించింది. పార్లమెంట్‌లో ఈ వి వాదాస్పద చ ట్టం నా లుగేళ్ల క్రితం ప్రతిపక్షాల నిరసనల నడుమ ఆమో దం పొం దింది. కాగా ఇప్పుడు ఈ వివాదాస్పద చట్టాన్ని లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముం దు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావడం కీల క విషయం అయింది. సిఎఎ సంబంధిత ని బంధనలు రూపొందించడంలో ఇంతవరకూ కొం త సంక్లిష్టత ఉండటంతో దీని అమలును వాయిదా వే స్తూ వచ్చారు. ఇప్పుడు చట్టంలోని నిబంధనలను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇక తగు విధం గా అమలుకు దిగుతామని కేంద్ర హోం మం త్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పుడు అమలులోకి రానున్న చట్టం మేరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌ల నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు సరైన పత్రాలు లేకుండా వలసవచ్చిన ముస్లిమేతరులు తగు విధమైన దరఖాస్తు లు అందులోనూ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా వివరా లు పొందుపర్చుకుంటే భారత పౌరులుగా రికార్డుల్లోకి వచ్చేందుకు వీలేర్పడుతుంది.

ఈ మూడు దేశాలకు చెందిన , అక్కడ మైనార్టీలుగా వేధింపులకు గురైన హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లు ఇక్కడ వలసదార్లు గా ఉన్న ట్లు అయితే వారికి భారతీయ పౌరసత్వం సంక్రమింపచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2019లో ఈ వివాదాస్పద చట్టం రూపొందింది. రాష్ట్రపతి ఆమోదం కూ డా పొందింది. అప్పట్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాలలో నిరసనలు వెలువెత్తాయి. దీనితో నిబంధనలను రూపొందించడం , అమలుకు దిగ డం తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవలి కాలంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇతర బిజెపి నేతలు లోక్‌సభ ఎన్నికలకు ముందే కా అమలు జరుగుతుందని ప్రకటించారు. ఈ నెల 11న ఇది అమలులోకి వస్తుందని అమిత్ షా చెప్పినట్లే ఇదేరోజున ఇది అమలులోకి వచ్చింది. ఇప్పుడు తీసుకువచ్చిన నిబంధనలను పౌరసత్వ సవరణ నిబంధనలు 2024గా పిలుస్తారు. దీని వల్ల అర్హులైన వారు భారతీయ పౌరసత్వం కోసం సిఎఎ 2019 పరిధిలో తమ దరఖాస్తులను పొందుపర్చుకోవచ్చునని అధికార ప్రతినిధి వివరించారు.

పూర్తిగా ఆన్‌లైన్ ప్రక్రియలో సాగే ఈ దరఖాస్తుల కోసం త్వరలోనే ఓ ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు అవుతుంది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టం అయిన తరువాత కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి క్రమం తప్పకుండా సంబంధిత పార్లమెంటరీ కమిటీల నుంచి నిబంధనల ఖరారుకు సమయం తీసుకుంటూ వచ్చింది. సాధారణంగా పార్లమెంటరీ ప్రక్రియ మాన్యువల్ మేరకు ఓ చట్టం రూపొందిన తరువాత రాష్ట్రపతి ఆమోదం దక్కిన ఆరునెలల్లో నిబంధనలు రూపొందించాలి. లేకపోతే ఎగువ, దిగువసభల అనుబంధ లెజిస్లేటివ్ కమిటీల నుంచి సమ్మతి దక్కించుకోవల్సి ఉంటుంది. దీనిని పాటిస్తూ ఈ చట్టం కాలం చెల్లకుండా చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల అదును చూసుకుని నిబంధనలతో ముందుకు వచ్చారు.
రెండేళ్ల నుంచి అమలుకు రంగం సిద్ధం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చట్టంపై పలు రకాలుగా వివాదాలు రగులుకున్నా, భగ్గు మనే పరిస్థితి ఉన్నా ఈ చట్టం అమలుకు రంగం సిద్ధం చేసుకుంది. తొమ్మిది రాష్ట్రాలలో 30కి పైగా జిల్లా మెజిస్ట్రేట్‌లు, హోం సెక్రెటరీలకు ఈ చట్టం పరిధిలో పౌరసత్వం అనుమతిని ఇచ్చేందుకు వీలు కల్పించారు. కాగా ఇప్పటికీ హోం మంత్రిత్వశాఖ వెలువరిచిన వార్షిక నివేదికల మేరకు ఈ చట్టం కేటగిరిలోని ముస్లిమేతరులు 1414 మందికి భారతీయ పౌరసత్వం కల్పించారు. దీనికి సంబంధించి 1955 పౌరసత్వ చట్టం తటస్థీకరణ లేదా నమోదు ప్రక్రియలు చేపట్టారు. తొమ్మిది రాష్ట్రాలలోని ఈ కేటగిరి ముస్లింలకు పౌరసత్వం కల్పించేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే ఢిల్లీ, బెంగాల్, అసోం వంటి అత్యంత సున్నిత సంక్లిష్ట రాజకీయ పరిస్థితులు ఉన్న రాష్ట్రాలలో ఈ చట్టం అమలుకు అధికారుల నియామకం కానీ ఇతరత్రా చర్యలు కానీ చేపట్టలేదు. పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ ఈ చట్టాన్ని ఆది నుంచి ప్రతిఘటిస్తూ వస్తున్నారు. కాగా కోల్‌కతాలోనే గత ఏడాది చివరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ చట్టం అమలులోకి తెచ్చితీరుతామని, ఏ శక్తి తమను ఆపలేదని ప్రకటించారు. మమత బెనర్జీ ఈ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ప్రధాన ప్రచార అస్త్రం ఇదేనని ప్రకటించారు.
ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుండి పౌరచట్టం అమలులోకి తీసుకువచ్చిన దశలో దేశ రాజధానిలోని పలు ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఈశాన్య ఢిల్లీ, షాహీన్ బాగ్, జామియా ఇతర సునిశిత ప్రాంతాలలో తగు జాగ్రత్త చర్యలకు దిగారు. పోలీసు, పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. కొన్ని ప్రాంతాలలో పోలీసు కవాతు జరిగింది. కా, ఎన్‌ఆర్‌సి విషయాలలో 2020లో ఢిల్లీలో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. ఇప్పుడు ఈ పరిస్థితి రాకుండా పర్యవేక్షణ పెంచారు. ఈశాన్య ఢిల్లీలోని ప్రతి పౌరుడి భద్రత తమ తక్షణ కర్తవ్యం అని డిసిపి జాయ్ టిర్కే తెలిపారు.
సిఎఎని కేరళలో అమలు చేయం : సిఎం పినరయి విజయన్
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) ప్రజలను మతపరంగా చీల్చే చట్టంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. కేరళలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ఆయన ప్రకటించారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే సిఎఎని కేరళలో అమలు చేసే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. మతపరమైన చీలికను తెచ్చే ఈ చట్టాన్ని వ్యతిరేకించడంలో కేరళ సమాజమంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించడానికి ముందు సిఎఎకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీచేసిందని, దేశంలో అశాంతిని సృష్టించేందుకే కేంద్రం ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ప్రజలను విభజించి, మతపరమైన మనోభావాలు రెచ్చగొట్టి, రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కడానికే కేంద్రం సిఎఎ నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News