Sunday, January 19, 2025

ఎన్నికల ముందు సిఎఎ గుర్తొచ్చిందా?: ప్రతిపక్షాలు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై మరి కొద్ది వారాలలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం పట్ల ప్రతిక్షాలు భగ్గుమన్నాయి. సిఎఎ అమలుపై ఎన్నికల ముందు ప్రకటన చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపాయి. 2019 డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం కోసం నిబంధనలను ప్రకటించడానికి మోడీ ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాల మూడు నెలలు పట్టిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ౫ఇ జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం వ్యాపారం తరహాలో నిర్ణీత కాల వ్యవధిలో పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ గొప్పలు చెబుతుంటారని, సిఎఎ నిబంధనల ప్రకటన విషయంలో ప్రధాని పచ్చి అబద్ధాలు చెబుతారని మరోసారి నిరూపితమైందని ఆయన విమర్శించారు.

ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడి డడువును పొడిగించాలని కోరుతూ ఎస్‌బిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నేటి ఉదయం సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని, పత్రికలలో ఆ వార్త పతాక శీర్షిక కాకూడదనే దురుద్దేశంతోనే సిఎఎను మోడీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. సిఎఎ నిబంధనలను ప్రకటించేందుకు తొమ్మిదిసార్లు పొడిగింపులు కోరిన కేంద్రం ఎన్నికల ముందు దీన్ని ప్రకటించడం వెనుక ఎన్నికలను పునరేకీకరణ చేయాలన్న కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఈ కుట్రకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

కాగా..పశ్చిమ బెంగాల్ ప్రజలు శాంతియుతంగా, వదంతులకు దూరంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. సిఎఎ నిబంధనలను ఆరు నెలల క్రితమే ప్రకటించి ఉండవలసిందని ఆమె అభిప్రాయపడ్డారు. మంచి విషయాలు ఏవైనా అందులో ఉంటే తాము ఎల్లప్పుడూ ప్రశంసించడంతోపాటు మద్దతిస్తామని ఆమె తెలిపారు. అయితే దేశానికి మేలు చేయని దేన్నయినా తాము వ్యతిరేకిచండంతోపాటు తమ గళం విప్పుతామని ఆమె చెప్పారు. రంజాన్ ముందు ఈ ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చిందో తనకు తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News