Saturday, January 11, 2025

కారు చోరీలో 200 మీటర్లు క్యాబ్ డ్రైవర్‌ను ఈడ్చుకెళ్లిన దుండగులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. కారును దొంగలించిన కొందరు దుండగులు తప్పించుకునే ప్రయత్నంలో ఆ క్యాబ్ డ్రైవర్‌ను ఢీకొట్టి చాలా దూరం ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. ఫరీదాబాద్‌కు చెందిన బిజేంద్ర అనే డ్రైవర్ తన కారులో వెళ్తుండగా మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు దుండగులు దాడి చేసి అతని కారును దొంగిలించడానికి ప్రయత్నించారు. అతడిని బయటకు లాగి కారుతో సహా పారిపోడానికి ప్రయత్నించారు. అడ్డుకోడానికి చూసిన డ్రైవర్‌ను ఢీకొట్టగా కిందపడిపోయాడు. దుండగులు కారు వేగాన్ని పెంచి బిజేంద్రను దాదాపు 200 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై బిజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన వీడియోలో వైరల్ అయింది. పోలీస్‌లు రంగం లోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News