Saturday, January 11, 2025

ఉరివేసుకుని క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆర్థిక ఇబ్బదులను తట్టుకోలేక క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మెదక్ జిల్లా శంకరంపేట గ్రామానికి చెందిన అరికెల మహేశ్(28) నగరానికి వలస వచ్చి కొంపల్లిలో నార్త్ ఎన్‌సీఎల్‌లో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఒక ట్రాలీ ఆటోను కొనుగోలు చేసి నడుపుతున్నాడు, ఫైనాన్స్‌లో రుణం తీసుకుని వాహనం కొనుగోలు చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి.

అప్పులు కట్టడం ఇబ్బందిగా మారడంతో గత కొంత కాలం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News