Tuesday, January 21, 2025

పెళ్లికి ఒప్పుకోని వివాహిత… ఇంటికెళ్లి కత్తితో పొడిచి…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వివాహితను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమె తిరస్కరించడంతో ఆమెను అతడు పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిహార్‌లోని మధుబణి ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర శంకర్ ముఖియా అనే వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి ఢిల్లీలోని చిరాగ్ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడు. గత నెలలో ఓ మహిళను హత్య చేశారని సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనంచేసుకొని శవ పరీక్షకు తరలించారు. తలపైన పదునైనా ఆయుధంతో దాడి చేయడంతో ఆమె దుర్మరణం చెందిన శవ పరీక్షలో తేలింది.

ఈ క్రమంలో పోలీసులు స్థానిక సిసి టివి పూటేజీని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి 7.15 గంటలను ఇంట్లోకి వెళ్లి 7.27 గంటలకు బయటకు వచ్చాడు. సిసి టివి ఫూటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతడు శివ శంకర్ ముఖియాగా గుర్తించారు. శివ శంకర్ ముఖియా మూడు సంవత్సరాల క్రితం ఓ వేడుకలో స్నేహితుడి ద్వారా బాధితురాలిని కలిశాడు. గత నెలలో ఆమె భర్తకు ఓ వ్యక్తి పోన్ చేసి భార్యను వదిలిపెట్టాలని బెదిరించాడు. తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమె తిరస్కరించింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని అడగడంతో ఇద్దరు మధ్య గొడవ జరిరగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను పదునైన ఆయుధంతో తలపై బాదాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. శివ శింకర్‌తో పాటు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News