Sunday, December 22, 2024

మహిళ ముందు హస్త ప్రయోగం… క్యాబ్ డ్రైవర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ముంబయి: అమెరికా మహిళ ముందు క్యాబ్ డ్రైవర్ హస్త ప్రయోగం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి ప్రాంతం అంధేరీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యోగేంద్ర ఉపాధ్యాయ్ (40) అనే క్యాబ్ డ్రైవర్ ముంబయిలోని గోరుగ్రామ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అమెరికాకు చెందిన నలబై ఏళ్ల మహిళ బిజినెస్ పనులు నిమిత్తం ముంబయికి వచ్చింది. ఒక నెల రోజుల నుంచి ఇక్కడ ఉండి బిజినెస్ పనులు చేస్తుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఉద్యోగుల కోసం ప్రైవేట్ క్యాబ్‌ను ఆఫీస్ వాళ్లు బుక్ చేశారు. ఉద్యోగులు అందరూ దిగిన తరువాత ఆమె ఒక్కరే కారులో ఉన్నారు. ఆమె అంధేరి వెళ్లాల్సి ఉంది. ఆమె ఒంటరిగా ఉండడం గమనించిన క్యాబ్ డ్రైవర్ ప్యాట్ జీప్ విప్పి హస్త ప్రయోగం చేశాడు. వెంటనే కారు ఆపాల్సిందిగా మహిళ అరిచింది. అక్కడ ఉన్నవారిని అలెర్ట్ చేయడంతో క్యాబ్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకున్నారు. డిఎన్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకొని క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో అతడిపై ఎలాంటి కేసులు లేవని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News