Tuesday, January 21, 2025

సైడ్ ఇవ్వలేదని క్యాబ్ డ్రైవర్ హత్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బైక్‌వాలాలు ఓ కాబ్‌డ్రైవర్‌పై దాడిచేసి, కత్తితో పొడిచి చంపారు. సౌత్ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. బైక్‌పై వేగంగా వెళ్లుతున్న ముగ్గురు తమ ముందు కాబ్ కారు ఉండటంతో దీనిని దాటేసేందుకు ముందుకు సాగిన దశలో డ్రైవర్‌కు వీరికి మధ్య మాటాపెరిగి తగవుకు దారి తీసింది.

దీనితో క్యాబ్ డ్రైవర్ మనోజ్‌కుమార్‌పై వీరు కత్తితో దాడికి దిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆగంతకులు వెంటనే పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రంగంలోకి దిగి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరూ ఫరారీలో ఉన్నారు. సంఘం విహార్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ కుటుంబ పోషణకు ఓ కంపెనీ తరఫున క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News