Wednesday, April 2, 2025

విదేశీయురాలిపై అత్యాచారం.. 100కి కాల్ చేయడంతో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విదేశాల నుంచి హైదరాబాద్ చూసేందుకు వచ్చిన ఓ యువతికి ఇక్కడ దారుణమైన అనుభవం ఎదురైంది. నగరం నుంచి తిరిగి వెళ్తున్న ఆమెపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జర్మనీలో చదువుకున్న హైదరాబాదీ యువకుడిని కలిసేందుకు వారం రోజుల క్రితం జర్మనీకి చెందిన యువతి హైదరాబాద్‌కు వచ్చింది. సోమవారం స్నేహితులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించింది. తిరిగి తన దేశానికి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న ఆమెపై కారు డ్రైవర్ మామిడిపల్లి వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అయితే బాధిత యువతి 100కు డయల్ చేయగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ పోలీసుల రక్షణలో యువతిని వైద్య పరీక్షల కోసం పంపిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News