Friday, December 20, 2024

కిక్కు ఎక్కువైతే మాకు ఫోన్ చేయండి.. ఉచితంగా గమ్యస్థానాలకు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్: ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 వచ్చిందంటే చిన్నా, పెద్దా తమకు తోచిన విధంగా పార్టీలు చేసుకుంటారు. కొంత మంది పబ్, హోటళ్ళ నిర్వాహకులు మందు పార్టీలు ఇస్తుంటారు. స్నేహతులు, బంధువులు ఇళ్ళకు వెళ్ళి అక్కడ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మందు పార్టీలు నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం ఇప్పటికే పోలీసు అధికారులు పార్టీలపై అనేక ఆంక్షలు విధించారు. అంతే కాకుండా ఎక్కడకిఅక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బ్రీత్ ఎన్‌లైజర్‌ను ఉపయోగించి మరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి సమస్యలకు తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ ఒక్క చక్కటి పరిష్కారం మార్గం కనుగొంది.

డిసెంబర్ 31న మందు సేవించి వాహనాలు నడిపి సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండేందుకు వారు ప్రత్యేకంగా మందు బాబుల కోసం ఉచిత క్యాబ్ సేవలు చేస్తామని తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు షేక్ సలావుద్దిన్ తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుంచే ఇటువంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రారంభంలో 50 క్యాబ్‌లో ఏర్పాటు చేయగా అది ప్రస్తుతం 300 క్యాబ్‌లకు చేరినట్లు తెలిపారు. తమ వాహనాలు గ్రేటర్‌లోని పోలీసు వారు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్దనే ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించి అనుమతలు కోసం అధికారులను కూడా సంప్రదించినట్లు తెలిపారు.

సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా తమ వంతుటు ఇటువంటి సేవాకార్యక్రమాలు చేస్తున్నామన్నారు.మందుబాబులను ఉచితంగా, క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా మందుసేవించి వాహనాలు నడపడం ద్వారా వచ్చే సమస్యలపై వారికి అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తామన్నారు. మందు సేవించి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో వారికి వివరించి వారు మద్యం సేవించి వాహనానం నడపకుండా తమ వంతు కృషి చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడులకను పురస్కరించుకుని అతిగా మద్యం సేవించి గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితిలో ఉన్న వారు తమ మొబైల్‌కు 91777624678 నంబర్‌కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News