Thursday, January 23, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః శంషాబాద్ ఎయిర్ పోర్టులో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేయడంతో శనివారం రాత్రి క్యాబ్‌లు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు క్యాబ్ డ్రైవర్‌పై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తతతకు దారి తీసింది. క్యాబ్ డ్రైవర్, సెక్యూరిటీ గార్డు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో ఆగ్రహంతో గార్డ్, క్యాబ్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. డ్రైవర్‌పై చేయి చేసుకున్న డ్రైవర్‌ను వెంటనే ఉద్యోగంలో నుంచి తీసివేయాలని, జిఎంఆర్ సంస్థ జోక్యం చేసుకోవాలని గిగ్ వర్కర్ల సంఘం నాయకుడు షేక్ సలావుద్దిన్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News