హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా ఈ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్యసేవలందనున్నాయి. గతంలోనే సిఎం కెసిఆర్ మహబూబాబాద్, జగిత్యాల జిల్లాలకు వైద్య కళాశాలలు కేటాయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే తెలిసిందే. ఈ మేరకు సిఎం హామీని నిలబెట్టుకున్నారు. వైద్య కళాశాలల కేటాయింపుపై ఆయా జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 4 వైద్య కళాశాలలే ఉన్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. 2014 తర్వాత ప్రభుత్వం 5 వైద్య కళాశాలలు నిర్మించిందని మంత్రి తెలిపారు. తాజాగా మరో 7 వైద్య కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయని ఆయన చెప్పారు.
Cabinet approves 7 new medical colleges in Telangana