Sunday, December 22, 2024

పెసర పంటకు అత్యధికంగా మద్దతు ధర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పలు రకాల పంటల కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈమేరకు ఆమోదం తెలియజేసింది. ఈ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు తెలియజేశారు. పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను ఈసారి పెంచారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధర అధికంగా పెంచినట్టు పీయూష్ గోయల్ తెలిపారు.

గత ఏడాది క్వింటాల్ ధర రూ.7755 ఉండగా, ఈసారి 10.4 శాతం పెంచడంతో పెసరకు మద్దతు ధర రూ.8558 కి పెరిగింది. అలాగే హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ. 3180, జొన్న (మాల్దండి ) , రూ. 3225, రాగి రూ. 3846, సజ్జలు రూ. 2500, మొక్కజొన్న రూ. 2090, పొద్దుతిరుగుడు ( విత్తనాలు )రూ. 6760. వేరుశెనగ రూ. 6377. సొయాబీన్ (పసుపు పచ్చ)రూ. 4600, పత్తి (మధ్యస్థాయి పింజ) రూ. 6620, పత్తి (పొడవు పింజ) రూ. 7020 చొప్పున ఈ సీజన్‌లో ఇవ్వనున్నట్టు కేంద్రం తెలియజేసింది. ఇదిలా ఉండగా హుడా సిటీ సెంటర్ నుంచి గురుగ్రామ్ లోని సైబర్ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 స్టేషన్ల మీదుగా 28.50 కిమీ మేర ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మంజూరైన తేదీ నుంచి నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 5452 కోట్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News