Friday, December 27, 2024

ఆరు పంటలకు మద్దతు ధర పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గోధుమ పంటకు కనీస మద్దతు ధరను క్వింటాలు కు రూ. 150 చొప్పున పెంచింది. దీనితో ఇక గోధుమ మద్దతు ధర క్వింటాలుకు రూ 2425 కానుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థి క వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ భేటీలో మద్దతు ధరల పెంపుదల నిర్ణయానికి ఆమోదం తెలిపారు. రెండు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ మద్దతు ధర పెంపుదల నిర్ణయం తీసుకుంది. ఈ హెచ్చింపుతో గోధుమ పంట రైతులకు 202526 మా ర్కెటింగ్ సీజన్ నుంచి లాభం చేకూరుతుందని భేటీ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. గోధుమతో పాటు ఆరు రబీ పంటలకు కూ డా మద్దతు ధరలను పెంచారు. ఈ పెంపుదల రూ 130 నుం చి రూ 300 మధ్యలో ఉంటుంది.

ఇది కూడా పంటల విక్రయం ఆరంభమయ్యే ఏప్రిల్ 2025 నుంచి ఆ రంభం అయ్యే సీజన్ నుంచి చలామణిలోకి వస్తుందని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలకు కట్టుబడి ఉం దని, ఖరీఫ్ పంటల మాదిరిగానే రబీ పంటలకు కూడా మద్దతు ధరల్లో గణనీయ పెరుగుదల కల్పించినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనది మంత్రి చెప్పారు. పంట సాగు వ్యయంతో పోలిస్తే గోధుమ పంటకు ఇచ్చే మద్దతు ధర 105 శాతం ఎక్కువ అని వివరించారు. దీని వల్ల రై తాంగానికి మేలు జరుగుతుందన్నారు. ఇక దేశంలో వంటనూనెల దిగుబడిని పెంచేందుకు, దిగుమతులను తగ్గించేందుకు సం బంధిత గింజల మద్ధతు ధరల ను పెంచింది. ఇందులో భాగంగా ఆవాలు, ఆముద గింజల మద్దతు ధరలను క్వింటాలుకు రూ 300 పెంచారు. దీనితో ఈ రెండింటి

ధర ఇకపై రూ 5950 అవుతుంది. ఇక కుసుమ గింజలకు రూ 140 చొప్పున పెంచారు. దీనితో ఇంతకు ముందటితో పోలిస్తే వీటి ధర ఇకపై రూ 5800 అవుతుంది. ఇక పప్పు ధాన్యాలలో పెసరకు క్వింటాలుకు రూ 275 పెంచారు. దీనితో దీని ధర ఇకపై క్వింటాలుకు 6700 వరకూ రైతులకు పలుకుతుంది. శెనగపప్పు ధరను రూ 210 పెంచగా , దీని ధర ఇక క్వింటాలుకు రూ 5650 మేర దక్కుతుంది. బార్లీకి క్వింటాలకు రూ 130 పెంచారుదీనితో ఇంతకు ముందు క్వింటాలుకు ఉన్న రూ 1850 ధర ఇకపై రూ 1980 అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర , జార్ఖండ్, ఢిల్లీల్లో ఎన్నికలకు ఇప్పటి ధరల హెచ్చింపునకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు.

దేశంలో ఆయా దినుసు నిల్వల పెంపు, ధరల తగ్గింపు క్రమంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సాధారణంగా ఇప్పుడు ఈ కనీస మద్ధతు ధరల పెంపుదల సమయం అన్నారు. ప్రభుత్వం పట్ల రైతాంగంలో మంచి అభిప్రాయం వ్యక్తం అవుతోందని, వారి జీవన స్థితిగతుల్లో సరైన మార్పు తీసుకువచ్చే చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలతో దేశంలో పంటల వైవిధ్యత సాగు పెరుగుతుంది. రైతులకు సరైన గిట్టుబాటు ధరలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు ఆదాయం పెంచేందుకు పిఎం అన్నదాత ఆశా అభియాన్ పరిధిలో రూ 35 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోద ముద్రవేసింది. ఇక రబీ పంట సీజన్‌కు యూరియాఏతర ఎరువులకు రూ 24,475 కోట్ల మేర సబ్సిడీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.

ఉద్యోగులు, పింఛన్‌దార్లకు 3 శాతం డిఎ పెంపు
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వర్గాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈసారి కేబినెట్ భేటీలో వారి డిఎను 3 శాతం మేర పెంచింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు దీపావళి కానుకగా మూడు పాయింట్ల డిఎ పెంపుదల కల్పించారు. పెన్షనర్లకు మూడు శాతం డిఆర్ వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఈ డిఎ, డిఆర్ పెంపుదల జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. ఉద్యోగులు, పింఛన్‌దార్లకు ముందస్తు దీపావళి శుబాకాంక్షలు అని కూడా వైష్ణవ్ చెప్పారు. డిఎ/డిఆర్ పెరుగుదలతో ఖజానాకు రూ 9448 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. ఎడవ కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల మేరకు ఉద్యోగులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. డిఎ, డిఆర్‌ల పెంపుదలతో దేశంలోని దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది వరకూ పెన్షనర్లకు ప్రయోజనం కల్గుతుంది.

వారణాసి డిడియు ట్రాక్ ప్రాజెక్టుకు పచ్చజెండా
కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలకమైన వారణాసి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (డిడియు) బహుళ స్థాయి రైల్వే ట్రాక్‌ల ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపారు. దీనికి రూ 2642 కోట్ల వ్యయ అంచనాలు వేశారు. ఇది అత్యంత కీలకమైన రైలు / రోడ్డు బ్రిడ్జిగా ఉంటుంది. . గంగా నది మీదుగా బ్రిడ్జి , దీనితో పాటు వారణాసి డిడియు జంక్షన్ వరకూ మూడో నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి వీలేర్పడుతుంది. ఇతరత్రా మౌలిక నిర్మాణాల అధునాతనన ప్రక్రియకు కూడా ఇది దోహదం చేస్తుందని మంత్రి చెప్పారు. వారణాసి రైల్వే స్టేషన్ భారతీయ రైల్వేలకు ప్రధాన కేంద్రంగా ఉందని, పలు కీలక జోన్లకు అనుసంధానంగా ఉండటం, ఇదే క్రమంలో యాత్రికులు, పర్యాటకులు, స్థానిక ప్రజలకు ముఖద్వారంగా ఉండటంవల్ల ఇక్కడ ట్రాక్‌లు ఇతరత్రా నిర్మాణాల అవసరం ఎంతైనా ఉందని వైష్ణవ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News