- Advertisement -
కేంద్ర మంత్రివర్గం ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను (ఐటి) చట్టం స్థానంలో కొత్త ఐటి బిల్లును ఆమోదించిందని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష పన్ను అవగాహనను కొత్త బిల్లు సులభతరం చేస్తుంది. కొత్త పన్ను భారాన్ని దేనినీ ఇది మోపదు. దీనిలో నిబంధనలు, వివరణలు, లేదా సుదీర్ఘ వాక్యాలు ఉండవు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కొత్త ఐటి బిల్లును ఆమోదించిందని ఆ వర్గాలు తెలియజేశాయి. కొత్త ఐటి బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు, దీనిని ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
- Advertisement -