Monday, January 27, 2025

కొత్త పాన్ కార్డుకు క్యాబినెట్ ఆమోదం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ‘పాన్ 2.0’ కార్డును ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ఈ ప్రకటనతో పౌరులు తాము మళ్లీ కొత్త పాన్ కార్డుకు అప్లయ్ చేయాలా? అని ఆలోచిస్తున్నారు. కానీ అలా చేయనవసరం లేదు. మీ ప్రస్తుత పాన్ కార్డు చెల్లుబాటవుతుంది. సిస్టం డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం ఈ ‘పాన్ కార్డు 2.0’ ను తేబోతున్నారు.

కేంద్ర మంత్రి వైష్ణవ్ కొత్త పాన్ కార్డులను ప్రవేశపెడుతున్నామని ప్రకటించినప్పుడు పాన్ కార్డుకు ‘క్యూఆర్ కోడ్’ ను అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ప్రభుత్వం తాలూకు ‘డిజిటల్ ఇండియా విజన్’ కు అనుగుణంగా ఈ కొత్త క్యూఆర్ పాన్ కార్డును ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా ‘పాన్’ను కామన్ బిజినెస్ ఐడెంటిఫయ్యర్ గా చేయబోతున్నారు. ఇప్పటికే దేశంలో 78 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. అందులో వ్యక్తిగతమైనవి(ఇండివ్యూడ్యుయల్స్ వి) 98 శాతం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News