- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్యఘర్ యోజనకు కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. రూ.75,021 కోట్ల నిధులతో పథకాన్ని ప్రారంభించింది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయనుంది. దీంతో కోటి గృహాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందనుంది. ఈ పథకం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది కేంద్రం. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్రం చర్యలు తీసకుంది. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు వెబ్ సైట్ లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 13న పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
- Advertisement -