- Advertisement -
న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 20 గిగావాట్ల ప్రాజెక్టు గ్రిడ్ ఏర్పాటుకు వీలు కల్పించడానికి రూపొందించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ రెండో దశకు కేబినెట్ రూ. 12,000 కోట్లు మంజూరు చేసింది. దాదాపు 10,750 సర్కూట్ కిలో మీటర్ల సరఫరా లైన్ల ఏర్పాటుకు, 27,500 మెగా వోల్టు యాంపియర్లు సరఫరా సామర్ధం కలిగిన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు.
- Advertisement -