Saturday, November 16, 2024

ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం స్థల పరిశీలన

- Advertisement -
- Advertisement -

ములుగు : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు బిల్లు ఆమోదం పొందగా ములుగు మండలంలోని జాకారంలోని వైటిసి కేంద్రంలో తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం హైదరాబాద్ యూనివర్సిటీ బృందం సభ్యులు పరిశీలించారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి వచ్చిన దివేష్ నిగమ్, రిజిస్ట్రార్ బిజె రావు, ఉప కులపతి అభిషేక్ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్టేట్‌లకు ఐటిడిఏ పిఓ అంకిత్, అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. వేణుగోపాల్‌లు గట్టమ్మ దేవాలయం పక్కన కేటాయించిన ప్రభుత్వ భూమిని చూపించి వివరాలు తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఛాంబర్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారికి యూనివర్సిటీ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటిడబ్య్లూ జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, డిటిడిఓ దేశిరామ్, ములుగు తహసీల్దార్ విజయ భాస్కర్, సర్వేయర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News