Saturday, December 21, 2024

తెలుగు రాష్ట్రాలకు మూడు పారిశ్రామిక నగరాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రూ. 28602 కోట్ల అంచనా పెట్టుబడితో దేశీయంగా ఉత్పత్తి హెచ్చింపునకు పది రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక నగరాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పది రాష్ట్రాల వ్యాప్తంగా, వ్యూహాత్మకంగా ప్రణాళిక వేసిన ఆరు ప్రధాన కారిడార్లలో ఆ ప్రాజెక్టులు భారత ఉత్పత్తి సామర్థాల పెంపు, ఆర్థిక వృద్ధి కోసం చేస్తున్న కృ షి కి ఇతోధికంగా తోడ్పడతాయి. ఆ పారిశ్రామిక న గరాలను తెలంగాణలోని జహీరాబాద్, ఎపిలోని ఓ ర్వకల్లు, కొప్పర్తి, ఉత్తరాఖండ్‌లో ఖుర్పియా, పంజాబ్‌లో రాజ్‌పురా పాటియాలా, మహారాష్ట్రలో దిఘి, కేరళలో పాలక్కాడ్, యుపిలో ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, బీహార్‌లో గయ, రాజస్థాన్‌లో జోధ్‌పూర్ పాలిలలో ఏర్పాటు చేస్తారు,

రూ. 28602 కోట్ల అంచనా పెట్టుబడితో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌ఐసిడిపి) కింద 12 కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ సమావేశం అనంతరం తెలియజేశారు. వాటిని ప్రపంచ ప్రమాణాల ప్రకారం పర్యావరణ హిత పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేస్తారు. ఎన్‌ఐసిడిపి పుష్కలంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. వ్యూహాత్మక పారిశ్రామికీకరణ ద్వారా ప్రత్యక్షంగా పది లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 30 లక్షల వరకు ఉద్యోగాల కల్పించగలదని అంచనా. ఆ ప్రాజెక్టులు దాదాపు రూ. 1.52 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News