Friday, December 20, 2024

సఫాయీల జాతీయ కమిషన్ పదవీకాలం మూడేళ్ల పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Cabinet approves tenure extension of National Commission for Safai

 

న్యూఢిల్లీ: సఫాయీ కర్మచారీల జాతీయ కమిషన్(ఎన్‌సిఎస్‌కె) పదవీకాలాన్ని మరో మూడేళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తతీకున్నది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నదని సమాచార, ప్రసారశాఖమంత్రి అనురాగ్‌ఠాకూర్ తెలిపారు. కేబినెట్ నిర్ణయంతో ఎన్‌సిఎస్‌కె 2025 మార్చి 31వరకు కొనసాగనున్నది. పారిశుధ్య కార్మికుల స్థితిగతులపై పరిశీలన, సిఫారసుల కోసం ఈ కమిషన్‌ను 1994లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజ్యాంగేతర సంస్థగా సామాజిక న్యాయశాఖ కింద కమిషన్ పని చేస్తోంది. పారిశుధ్య కార్మికుల మెరుగైన జీవితం కోసం కమిషన్ సూచనలు చేస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News