Friday, December 20, 2024

పేదలకు ఉచిత ధాన్యం మరో ఐదేళ్లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించిందిం. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి గరీబు కళ్యాణ్ అన్న యోజన ( పిఎంజికెఎవై)ను ఐదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకుని, దీనిని ఆమోదించినట్లు ఆ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు బుధవారం తెలిపారు. మొత్తం 81.35 కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు ఈ పథకం పరిధిలో నెలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. దీనికి ప్రభుత్వ ఖజానాకు రూ 11.80 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి 1 వ తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటు ఈ పథకం కొనసాగింపు ఉంటుందని మంత్రి వివరించారు. ఈ పొడిగింపుతో ఈ పేదల సహాయక పథకం ఇక మరో ఐదు సంవత్సరాలు అంటే 2029 వరకూ ఉంటుంది. ఈ మేరకు నెలకు ఐదు కిలోల చొప్పున పేదల కుటుంబాలకు బియ్యం గోధుమలు అందుతాయి.

పేదలకు ఆహార భద్రత అవకాశం కల్పించాల్సి ఉంది. వారికి నిత్యావసర సరుకులు అందుబాటులోకి రావాలి. ఈ పథకం అమలులో వివిధ రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయి సార్వత్రికతను పాటించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ ఆహార ధాన్యాలు పేదలకు ఉచితంగా అందిస్తారని, దీని వల్ల స్కీం పరిధిలోని లబ్థిదారులకు ప్రయోజనం ఉంటుంది. కరోనా కష్టకాలం సమయంలో 2020లో ప్రధాన మంత్రి గరీబు యోజనను ప్రవేశపెట్టారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) పరిధిలో సబ్సిడీకి ఈ ఆహార ధాన్యాల సరఫరా పథకం తలపెట్టారు. ఈ పథకం పరిధిలో గ్రామీణ పేద జనం 75 శాతం మేర, పట్టణ ప్రజలు 50 శాతం వరకూ రెండు వేర్వేరు అనుబంధ స్కీంలు ఆంత్యోదయ అన్నయోజన, ప్రాధాన్యతల క్రమపు నివాసితుల పరిధిలో ఉచిత ఆహారధాన్యాల పంపిణీ జరుగుతూ వస్తోంది. ఈ పథకం మరింతగా కొనసాగించడం చారిత్రకం అని , ఇది పేదల బాగోగులు పట్టించుకునే తమ ఉద్ధేశాల విషయంలో మరో కట్టుబాటు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

16వ ఆర్థిక సంఘం నిబంధనలకు అనుమతి
కేంద్ర మంత్రి మండలి భేటీలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 16వ ఆర్థికసంఘం నియమ నిబంధనలు(టర్మ్ ఆఫ్ రెఫరెన్స్)కు అనుమతిని ఇచ్చింది. దీని మేరకు పన్నుల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీల నిష్పత్తిల ప్రతిపాదనలకు వీలేర్పడుతుంది. ఇదే విధంగా ఆర్థిక విపత్తుల నిర్వహణ చొరవల సమీక్షకు దారితీస్తుంది. 2026 ఎప్రిల్ 1 వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. ఇక 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్‌పర్సన్ , సభ్యుల పేర్లను త్వరలోనే ఖరారు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

పిఎంజెఎఎన్‌ఎకు ఆమోదం
కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌కు ఆమోదం తెలిపింది. ఈ అభియాన్ పరిధిలో పూర్తిగా అణగారి ఉన్న గిరిజనులకు సంబంధించి 11 అత్యంత క్లిష్టమైన సమస్యలపై దృష్టి సారిస్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. జార్ఖండ్‌లోని కుంతిలో జన్‌జాతి గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాని మోడీ ఈ పథకం ప్రకటించారు. దీని అమలు గురించి ఇప్పుడు కేంద్ర మంత్రిమండలి నిర్ణయంతీసుకుందని మంత్రి తెలిపారు. పిఎం జన్మన్ అనే ఈ పథకం వ్యయాన్ని మొత్తం మీద రూ 24,104 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో కేంద్రం వాటా రూ 15,336 కోట్లు. రాష్ట్రాలు భరించాల్సింది రూ 8768 కోట్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News