Friday, December 20, 2024

నేడు కేబినెట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్‌లో పలు కీలకమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. సచివాలయంలో మంగళవారం ఉదయం 12 గంటలకు సమావేశం జరిగేలా ప్రాథమికంగా షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా నిర్దిష్టమైన ఎజెండా రూపొందించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంఛనంగా భద్రాచలంలో అట్టహాసంగా సోమవారం సిఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రి వర్గ సహాచరులతో కలిసి ప్రారంభించిన నేపథ్యంలో హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల రుణాలు సమకూర్చుకోడానికి హౌజింగ్ బోర్డుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి హౌసింగ్ బోర్డు రుణాలు తీసుకోవడానికి ఆమోదం తెలుపనున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మిలో నెలకు రూ. 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో స్వయం సంఘాల రాష్ట్ర స్దాయి మహిళా సదస్సుకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News